టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్,కమిట్ మెంట్ కొత్తేమీ కాదు. ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఇప్పుడు మరోసాని యువ నటి నైనిష చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. బ్రహ్మముడి సీరియల్ చూసేవారికి నైనిష పరిచయం అక్కర్లుని పేరు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది నైనిష. ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఏ ఫ్యామిలీ అమ్మాయిలను యాక్సెప్ట్ చేయదని …అందుకే తన కుటుంబం తనకు దూరమైందని చెప్పారు. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అనేది ఎక్కువగా ఉందని.. ఒక ప్రాజెక్టు విషయంలో రెండు రోజుల్లో షూటింగ్ అనగా మేనేజర్ కమిట్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి షాకిచ్చింది.
తాను కుదరదు అన్నందుకు చాలా ఇబ్బందికి గురి చేశారని తెలిపింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. అయితే తర్వాత అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని తెలిపారు నైనిష. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం, శ్రీమంతుడు వంటి సీరియల్స్‌లో నటించింది నైనిష.
