Friday, March 29, 2024
- Advertisement -

ఆ తప్పు నాది కాదు.. అంటున్న బ్రహ్మానందం..!

- Advertisement -

ఒకవైపు బ్రహ్మానందం కెరీర్ ఇబ్బందుల్లో పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో బ్రహ్మీ పాత్ర అంతగా నవ్వించడం లేదని.. ఒకటి కాదు… ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా బ్రహ్మీ పాత్ర హిట్ కాలేదని దీంతో.. బ్రహ్మానందం కెరీర్ ఇబ్బందుల్లో పడిందని మీడియా విశ్లేషకులు అంటున్నారు.

“రేసుగుర్రం” వంటి సినిమా వచ్చినప్పుడు బ్రహ్మానందం మానియా పట్టుకుంది ఇండస్ట్రీకి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ఆయన పాత్ర చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం లేదు. ఇదే సమయంలో చాలా మంది యువకామెడియన్లు దూసుకొస్తున్నారు. సప్తగిరి, శ్రీనివాసరెడ్డి వంటి వాళ్లు తమ మార్కుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో బ్రహ్మానందం ఈ విషయం పై కూడా స్పందించాడు.

సినిమాల్లో తన పాత్ర అంతగా పేరు తెచ్చుకోకపోయినా… దానికంటూ ఒక గుర్తింపు రాకపోయినా.. స్టార్ కమేడియన్ అయినప్పికటీ తను సినిమాకు ఏ విధంగానూ ప్లస్ కాకపోయినా.. ఇంతకు ముందులా తన పాత్రలకు పేరు రాకపోయినా… దానికంతా తప్పు నాది కాదు అని అంటున్నాడు బ్రహ్మానందం. అదంతా దర్శకుల, రచయిత తప్పే అని బ్రహ్మీ చెబుతున్నాడు. వాళ్లు సరిగా రచన చేయకపోవడంతోనే… తన పాత్రలకు పేరు ప్రఖ్యాతులు రావడం లేదని ఆయన అంటున్నాడు. మరి ఈ సీనియర్ కామెడియన్ లాజిక్ లో నిజం ఉంది కానీ… దీని వల్ల నష్టం మాత్రం బ్రహ్మీకే అని వేరే చెప్పనక్కర్లేదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -