Thursday, May 2, 2024
- Advertisement -

రవాణా శాఖ కఠిన నిర్ణయం

- Advertisement -

నిబంధనలను గాలికి వదిలి ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆరు వేల మంది లైసెన్సులను రద్దు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత భారీ ఎత్తున లైసెన్సులు రద్దు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ లైసెన్సులు రద్దు అయిన వారిలో ఎక్కువ శాతం మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారే కావడం గమనార్హం.

ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో నిబంధనలను ఉల్లంఘిన వారి లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఇలా రద్దు అయిన వారిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే కాక ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారి లైసెన్సుల విషయంలో ఆయా రాష్ట్రాల రవాణా శాఖకు లేఖలు రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ప్రమాదాలకు దారి తీసే నాలుగు రకాల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వాటిలో మద్యం తాగి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం,  విపరీతమైన వేగం, సిగ్నల్ జంపింగ్, పరిమితికి మించి సరుకు రవాణా చేయడం వంటివి నిబంధనలను సీరియస్ గా తీసుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -