Monday, May 6, 2024
- Advertisement -

20 వ తేదీన బ్రహ్మోత్సవం రిలీజ్!

- Advertisement -

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలో కూడా మహేష్ కు మంచి పాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకేకుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ సినిమాపై మహేష్ అభిమానులో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలు మహేష్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ పై రోజుకో వార్త రావడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది.

బ్రహ్మోత్సవం సినిమాను మే 20న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాలో మరో రెండు పాటలు షూటింగ్‌ జరుపుకోలేదట. సమంత, మహేష్ బాబులపై ఈ పాటను తీయాల్సి ఉండగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు ఏమీ జరగడం లేదట. మరి వీరిద్దరిపై తీయాల్సిన పాటలను ముందే తీసారా.. లేక సినిమాలోనుండి డిలీట్ చేశారా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క మహేష్ బాబు తన ఫ్యామిలీతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక మే 7న ఆడియో విడుదల చేసి.. ఆ వెనువెంటనే డబ్బింగ్ పనలను పూర్తి చేయాలని చూస్తున్నారు.

మే 10 నాటికి సినిమా పనులన్నీ కంప్లీట్ చేసి.. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని మొదటి కాపీని రెడీ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. మే 18 నాటికి సినిమాను ఏరియాల వారిగా పంపిణీ చేసి.. 20 వ తేదీన ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ సారి పక్కా ప్లాన్ వేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ టైం కు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. మరో పక్క ఈ సినిమాకి సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది. సమంతతో మహేష్ సినిమాలు చేసినవి అన్ని హిటే. అలాగే కాజల్ తో చేసిన సినిమాలు అన్ని హిటే. సో మరో సారి బ్రహ్మోత్సవంతో భారీ హిట్ కొడుతాను అని మహేష్ అనుకుంటున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -