Friday, May 10, 2024
- Advertisement -

బ్ర‌హ్మానందం సినిమాల‌కు గుడ్ బై???

- Advertisement -

తెలుగులో కామెడీ కింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్ర‌హ్మానందం. ఆయన 30 ఏళ్లు సినీ ఇండ‌స్ట్రీలో దూసుకుపోయార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ఎత్తు ప‌ల్లాలు ఉన్నట్లే.. సినిమా జీవితంలో కూడా  ఎత్తు ప‌ల్లాలు ఉంటాయి. బ్ర‌హ్మానందానికి కూడా అలాంటి టైం వచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అనే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలలో వినిపిస్తోంది. అయితే హీరోలకు వరస ప్లాప్ వచ్చి తర్వాత సరైన హిట్ వస్తే తిరిగి వారి స్టార్ డమ్ వారికి వస్తోంది కానీ హీరోయిన్, కమెడియన్ ల విషయంలో అలా కాదు. వరస ప్లాప్ లు వస్తే ఆ కమెడియన్‍ల కెరీర్ గాడి త‌ప్పుతుంది.

కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందం తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక అతని పని అయిపోయింది అనుకున్న టైం లో మళ్లీ రీబౌన్స్‌ అయ్యారు. కొన్ని చిత్రాలు అయితే అతని కామెడీతోనే నిలబడ్డాయి. కానీ గత రెండేళ్లుగా ఆయన ప‌రిస్థితి అంతా తారుమార‌వుతోంది. యువ కమెడియన్ల రాకతో బ్రహ్మానందం ను అందరూ పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన సినిమాలలో కనిపించేది తక్కవైయింది.

ఆయనపై నెమ్మదిగా మొదలైన నెగటివిటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. గ‌త‌ రెండేళ్లలో ఆయన కేవలం ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌, సరైనోడు’చిత్రాల్లో నామ‌మాత్రంగా కనిపించారు. త్రివిక్రమ్ సినిమాలో తరుచు కనిపించే బ్రహ్మీ ‘అ..ఆ’లో నిపించలేదు. మొత్తానికి బ్రహ్మీ కెరీర్ గాడి త‌ప్పింది. అందుకే బ్ర‌హ్మీ సినిమాల‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -