అక్కినేని నాగచైతన్య, చెన్నై చిన్నది సమంత చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తానికి వీరి లవ్ కి శుభం కార్డు పడి.. పెళ్లి వరకు వచ్చిందని.. వచ్చే ఏడాది వీరిద్దరు పెళ్లి చెసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. పెళ్లికి సంబంధించి చైతు-సమంత షాపింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇప్పుడు ఓ షాకింగ్ వార్త అందరిని షాక్ చేస్తోంది. చైతు – సమంత పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితుల్లో ఉందా ? అసలు వీరి పెళ్లి లేట్ అవ్వడానికి కారణం ఏంటన్న దానిపై ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లి సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదట. నలుగురిలో నవ్వుతూ కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఈ పెళ్ళికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. రీసెంట్గా సమంత తల్లిదండ్రులతో విబేధించి చైతు ప్లాట్‌కు వచ్చేయడం వెనక ఈ బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది.
అటు సమంత, ఇటు నాగ్ ఫ్యామిలీ సమంత తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎంత ట్రై చేసినా వారు ఒప్పుకోకపోవడంతో నాగ్ ఫ్యామిలీ వీరి పెళ్ళికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారట. వాస్తవానికి అఖిల్ పెళ్లి కంటే వీరి పెళ్లే ముందు చేయాలని నాగ్ ప్లాన్ చేసినా, సమంత తల్లిదండ్రులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ముందుగా ఫిక్స్ అయిన చైతు-సమంత పెళ్లి క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఫ్యామిలీ ఓకే చెప్పినా, చెప్పకపోయినా చైతు-సమంత పెళ్లికి నాగర్జున డేట్ ఫిక్స్ చేసేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Related