Thursday, May 2, 2024
- Advertisement -

స‌మంత, రానా రొమాన్స్ వీడియో!

- Advertisement -

అందాలా భామ స‌మంత తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటివలే స‌మంత నాగచైతన్య ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలను వదిలేది లేదని చేబుతోంది సమంత. ఇప్పుడు కొన్ని కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది.

అందుకు తగినట్టుగానే విశాల్‌తో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. ఇదిలా ఉంటే చైతుతో మూడు ముళ్లు వేయించుకోబోతున్న స‌మంత ఇప్పుడు చైతు బావ‌తో క‌లిసి రొమాన్స్ చేసిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. అదేంటి చైతును పెళ్లాడితే స‌మంత రానాకు సోద‌రి వ‌రుస అవుతుంది క‌దా..వీరిద్ద‌రి రొమాన్స్ ఏంటా అని షాక్ అవుతున్నారా..మ‌రి అస‌లు మ్యాట‌ర్ ఏంటో చూద్దాం.

సమంత.. రానా తో కూడా ఓ సినిమా చేసింది. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘బెంగళూరు డేస్‌’ తమిళ రీమేక్‌లో ఈ జంట కనువిందు చేసింది. మలయాళంలో నిత్యామీనన్‌ చేసిన స్పెషల్‌ రోల్‌లో సమంత మెరిసింది. రానాతో కలిసి సమంత చేసిన రొమాన్స్‌  సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}NpLiHoZzMB8{/youtube}

Related

  1. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది
  2. శృతిహాస‌న్ ఎవరితో డేటింగ్‌ చేస్తుందో తెలుసా?
  3. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?
  4. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -