Monday, April 29, 2024
- Advertisement -

మరోసారి అమ్మాయిలపై కామెంట్స్ చేసిన చలపతిరావు

- Advertisement -

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్ మరువక ముందే ఆయన మళ్లీ అటువంటి కామెంట్స్ చేసి కలకలం సృష్టిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలాపతి రావు మాట్లాడుతూ సమాజంలో ఏ సమస్యలి లేనట్లు ఆడపిల్లలు వేసుకుంటున్న దుస్తుల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ కాలంలో అమ్మాయిలు ఫ్యాంటు, టీషర్టు వేసుకుంటే తప్పని తాను అనడం లేదని అనిన చలపతిరావు.. గతంలో ఓణీలు వేసుకునేవారని, కానీ ఇప్పటి అమ్మాయిలు మాత్రం ఆ ఓణీలు ఎందుకు వేసుకుంటున్నారో వాళ్లే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని కామెంట్ చేశారు. మరోవైపు.. చున్నీలను వేసుకునే చోట కాకుండా తలకు, మెడకు చుట్టుకుంటున్నారని.. ఎక్కడ వేసుకోవాలో కూడా తెలియడం లేదని అన్నారు. ఇలాంటి అమ్మాయిలకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదని అన్నారు. వారికి అది తప్పు అలా ఉండోద్దు అని చెప్పుదాం అంటే.. చాదస్తపరుడు, ముసలోడు అని అంటారని వ్యాఖ్యానించాడు.

అమ్మాయిలు చున్నీని మెడకి లేదా తలకో చుట్టుకుని వెళ్లినపుడు వారిని చూసిన అబ్బాయిలు కామెంట్ చేస్తారని, ఇక అమ్మాయిలకు ఓపిక ఉంటే ఆ యువకులతో దెబ్బలాడతారని, లేదంటే సైలెంట్ గా వెళ్లిపోతారని అన్నారు. ఇలాంటి బట్టలు వేసుకొని.. జీవితాంతం ఎందుకు దెబ్బాలాడాలి అని ప్రశ్నించారు. అయితే ప్రత్యేకించి ఆయన చున్నీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే విషయం ఇప్పుడు మళ్లీ వివాదం అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -