Wednesday, May 1, 2024
- Advertisement -

రేపు నామేనేష్‌న్ వేయ‌నున్న వెంక‌య్య‌నాయుడు..

- Advertisement -

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో త‌మ త‌ర‌ఫున నిల‌బెట్టాల్సిన అభ్య‌ర్థి కోసం ఎన్డీఏ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం అయింది. త‌న నివాసం నుంచి బ‌య‌లుదేరిన కేంద్రమంత్రి వెంక‌య్య నాయుడు స‌మావేశ ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్ప‌టికే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వ‌రాజ్‌, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌య్యారు.

అంద‌రూ అనుకున్న‌ట్లు గానే ఎన్డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడు పేరు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు, బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఒ.రాజ‌గోపాల్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. ఉత్త‌ర‌భారత్ నుంచి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని నిల‌బెట్టిన నేప‌థ్యంలో ద‌క్షిణ భార‌త్ నుంచి ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని చూస్తోంది. వెంక‌య్య నాయుడినే ఎన్డీఏ తమ అభ్య‌ర్థిగా నిర్న‌యం తీసుకున్నారు.

వెంక‌య్య‌నాయుడు రేపు ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారని తెలిసింది.మ‌రి కాసేప‌ట్లో ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.ఆయన ఉపరాష్ట్రపతి అయితే, రాజ్యసభ ఛెయిర్మన్ అయితే, ఎంత బాగుంటుందో లని అంతా పొగుడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే, బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు రాత్రి 7.30 గంటలకు జరిగే విలేకరులతో సమావేశంలో ప్రకటిస్తారు.

వెంకయ్యనాయుడు యుపిఎ ఉప రాష్ట్ర అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ తో తలపడతారు.ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు గతంలోనే ఖరారుచేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -