Friday, May 10, 2024
- Advertisement -

గ్రామ‌స్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌నుంచి వివిరాలు సేక‌రించిన పీకే బృందం

- Advertisement -

ఎన్నిక‌ల నోటిపికేష‌న్ రాక‌ముందే నంద్యాల రాజ‌కీయీలు మాంచి జోరుమీదున్నాయి.ఇరు పార్టీలు ప్రాచ‌రంలో దూసుకుపోతున్నారు.అధికార‌,ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ఢీ అంట‌ఢీ అంటున్నాయి.చంద్ర‌బాబు సొంతంగా చేయించుకున్న‌స‌ర్వేలో పార్టీకి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని తేలింది.అందుకే క‌నీసం ప‌రువుపోకుండా కాపాడుకోవాల‌ని త‌న మంత్రి వ‌ర్గం అంతా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో మోహ‌రించారు.
ఇక వైసీపీకూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది.ఆపార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగారు.త‌న ప‌నిని నంద్యాల ఉప ఎన్నిక నుంచె మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.త‌న బృందంతో నంద్యాల‌లో దిగారు.ఇప్ప‌టికే గ్రామ స్థాయినుండి మండ‌ల స్తాయి వ‌ర‌కు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించారు.
పీకే బృందం నాలుగు రోజుల‌పాటు నంద్యాల నియేజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టించి ఒక రిపోర్ట్‌ను త‌యారు చేసి పీకే కు ఇవ్వ‌నున్నారు.ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన వెంట‌నే త‌మ అభ్య‌ర్థిని గెలిపించ‌డానికి వ్యూహాలు అమ‌లు చేయ‌నున్నారు.ఎన్నిక‌ల్లో శిల్పా దాదాపు 50 వేల మెజారిటీ వ‌చ్చేవిధంగా కృషిచేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -