Monday, May 13, 2024
- Advertisement -

చరణ్ సుకుమార్ ల రేప‌ల్లె మూవీ కథ ఇదే

- Advertisement -
ram charan sukumar movie story

ఎప్పటికప్పుడు కొత్త కథలతో టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు సుకుమార్. మహేష్ తో 1 నేనొక్కడినే, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో వంటి డిఫరేంట్ సినిమాలు తీసి త‌న‌కంటూ టాలీవుడ్‌లో స‌ప‌రేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. తాజాగా సుకుమార్.. మెగా పవర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో  ఓ స‌రికొత్త కథతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. కాడెత్తుకుని వెళుతున్న రాంచరణ్‌ పోస్టర్ వైరల్‌గా మారింది.

ఈ మూవీకి ప‌ల్లెటూరి ప్రేమ‌లు, రేప‌ల్లె అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ స్టోరీ లైన్ కూడా ఇండ‌స్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ఈ మూవీ స్టోరీ.. ఏంటంటే.. హీరో పక్కా పల్లెటూరి కుర్రాడు.

అందరితో కలిసిమెలిసి ఉంటుంటాడు. అలాంటి యువకుడు అనుకోకుండా ఓ పని మీద సిటీకి రావాల్సి వస్తోంది. సిటీలోనే ఓ ప్రయోగశాలలో పనికి కుదురుతాడు. అక్కడున్న శాస్త్రవేత్తలు మనిషిపై ఓ ప్రయోగం చేయాలన్న దుర్భుద్దితో ఉంటారు. ఆ శాస్త్ర‌వేత్త‌ల క‌న్ను ఈ యువకుడిపై పడుతుంది. ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు హీరోపై ప్రయోగం చేశారా? ఒకవేళ చేస్తే ఆ తదనంతరం జరిగిన పరిణామాలేంటి అనే విషయాలను సుకుమార్ ఆసక్తికరంగా తెరకెక్కించనున్నాడని టాక్. మరి ఈ కథ ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన స‌మంత హీరోయిన్‌గా నటించనుంది.

Related

  1. చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత!
  2. మహేష్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!
  3. చిరుని నానా హింసలు పెట్టిన రామ్ చరణ్!
  4. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -