Sunday, May 12, 2024
- Advertisement -

ఆ పని చేసి పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన రాజ‌మౌళి కొడుకు

- Advertisement -
rajamouli son book in drunk and drive

టాలీవుడ్ సెల‌బ్రిటీలు హైద‌రాబాద్‌లో.. ఇటీవ‌ల ప‌దే ప‌దే త‌ప్ప‌తాగి కారు న‌డుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తాగి కారు నడపొద్దు అని చెపుతున్న.. వారు మాత్రం మారడం లేదు. పుల్ గా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఈ నెపథ్యంలో ఓ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ కుమారుడు కూడా పుల్ గా తాగేసి కారు న‌డుపుతూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు దేశ‌వ్యాప్తంగా బాహుబ‌లి సినిమాతో పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. రాజ‌మౌళి కుమారుడు కార్తీకేయ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయాడ‌ట‌. ఈ సంగతిన్ని రాజ‌మౌళికుమారుడు కార్తీకేయే స్వ‌యంగా వెల్ల‌డించాడు. షో సమయంలో ఆడియో లాంచ్ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ తాను గ‌తంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాన‌న్న విష‌యాన్ని తెలిపాడు.

అప్పటికి తనకు తాగి కారు నడపడం నేర‌మ‌న్న విషయం తనకు తెలియదని.. వాళ్లు తాగి నడపొద్దన్నారు కానీ.. తాగుతూ నడపొద్దనలేదు కదా. అందుకే.. నేను అప్పటికే కొంత మద్యం సేవించినా.. మళ్లీ మద్యం సేవిస్తూనే కారు నడిపాను. దీంతో పోలీసులు ఆప‌డంతో అప్పుడు అది కూడా నేర‌మే అన్న సంగ‌తి త‌న‌కు తెలిసింద‌ని కార్తీకేయ తాను చేసిన త‌ప్పును సభాముఖంగా ఒప్పుకున్నాడు. అప్పుడు రాజ‌మౌళి కూడా అక్క‌డే ఉండ‌డం విశేషం.

Related

  1. షూటింగ్ లో ఫుల్లుగా మందుకొట్టి అడ్డంగా బుక్ అయిన హన్సిక!
  2. రైల్లోనే టీటీఈ రొమాన్స్‌.. అడ్డంగా పట్టుకున్న ప్ర‌యాణికులు!
  3. స్టూడెంట్స్‌తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన టీచ‌ర్
  4. ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -