Saturday, April 20, 2024
- Advertisement -

మోడీపై అంత నమ్మకమెందుకు ?

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ప్రపంచ ధేశాల అధినేతలలో భారత ప్రధాని నరేంద్రమోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడుగా పేరు పొందారు. మోడీ తీసుకునే ఏ నిర్ణయం అయిన ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇక మోడీ దోస్తీ కోసం ప్రపంచదేశాల అధినేతలు అమితంగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక ఇటీవల రష్యా అద్యక్షుడు వ్లాదిమార్ పుతిన్ తో మోడీ భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భేటీలో మోడీ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఎంత శక్తివంతమైన నేతనో మరోసారి రుజువైంది. గత కొన్నాళ్లుగా రష్యా ఉక్రెయిన్ మద్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వార్ కు సంబంధించి మొదట్లో భారత్ తటస్థంగా వ్యవహరించింది. అటు రష్యాకు గాని ఇటు ఉక్రెయిన్ కు గాని ఎలాంటి మద్దతు తెలపలేదు. దీంతో మోడీ తటస్థ వైఖరిపై ఉక్రెయిన్, అమెరికా వంటి దేశాలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయినప్పటికి భారత్ ఈ వార్ విషయంలో మౌనం వహించింది. కానీ ఇటీవల పుతిన్ తో జరిగిన సమావేశంలో వార్ విరమించుకోవాలని, సమస్యను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని మోడీ కోరారు. దీనిపై పుతిన్ కూడా సానుకూలంగా స్పందించాడు. ఇక ప్రపంచ దేశాలు సైతం మోడీ చేసిన హితబోధపై సానుకూలంగా స్పందించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కూడా ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

మోడీ చేసిన వ్యాఖ్యలు సరైనవని, అన్నీ దేశాలు అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అమెరికా సైతం మోడీ చేసిన వ్యాఖ్యలను స్వాగతించింది. యుద్దం ఆపాలని మోడీ కోరడం అభినందనీయం అని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జెక్ సుల్లివాన్ తాజాగా చెప్పుకొచ్చారు. దీంతో మోడీ మాటపై ప్రపంచ దేశాలు కనబరుస్తున్న నమ్మకంన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు హైలెట్ చేస్తున్నాయి. మరి చిరకాల మిత్రదేశం అయిన భారత్ కోరిక మేరకు రష్యా ఉక్రెయిన్ పై యుద్దాన్ని విరమించుకుటుందో లేదో చూడాలి.

Also Read : గాడ్ ఫాదర్ ను గాలికి వదిలేసిన చిరు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -