Friday, April 26, 2024
- Advertisement -

భారత్ ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందంటే ?

- Advertisement -

భారత్ ఆసీస్ మద్య జరుగుతున్నా మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది. నిన్న జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన భారీ స్కోర్ ను ఆసీస్ ఏమాత్రం తడబడకుండా విజయం సాధించింది. మొహాలీ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లలో కెప్టెన్ రోహిత్ 11 పరుగులకే వెనుదిరుగగా, ఆసియా కప్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ కూడా కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే కే‌ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించారు..

కే‌ఎల్ రాహుల్ 35 బంతుల్లో 55 పరుగులు ( 4 ఫోర్లు, 3 సిక్సులు ), చేయగా సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 46 పరుగులు ( 2ఫోర్లు, 4 సిక్సులు ) చేసి చక్కటి సహకారం అందించాడు. ఇక చివర్లో హర్ధిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.. పాండ్య 30 బంతుల్లో 71 పరుగులు ( 7 ఫోర్లు, 5 సుక్సులు ) చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక టీమిండియా నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో కాస్త తడబడినప్పటికి.. తరువాత వేగంగా పుంజుకుంది.. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో కేంరూన్ గ్రీన్ 30 బంతుల్లో 61 పరుగులు.. వైడ్ 21 బంతుల్లో 45 పరుగులు, స్మిత్ 24 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టు విజయనికి బాటలు వేయగా ఫించ్ 22 పరుగులు, డేవిడ్ 18 పరుగులు చేసి చక్కని సహకారం అందించడంతో టీమిండియా నిర్దేశించిన 208 పరుగులను ఆసీస్ 19.2 ఓవర్లలోనే 211 పరుగులు చేసి విజయం సాధించింది.

దీంతో ఆసీస్ మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో 1-0 గా ఆధిక్యంలో నిలిచింది. అయితే టీమిండియా ఓటమిలో ముఖ్యంగా బౌలింగ్ విఫలం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. యజువేంద్ర చహల్ 3.2 ఓవర్లలో 42 పరుగులు, హర్షల్ పటేల్ 49 పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులివ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం.. 19 వ ఓవర్లో భువి ఏకంగా 15 రన్స్ ఇచ్చాడు. దీంతో టీమిండియా ఓటమికి తలోగ్గింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -