Saturday, May 4, 2024
- Advertisement -

కమల్ దర్శకత్వంలో చిరంజీవి?

- Advertisement -

ఈ వార్త నిజమైతే… చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అసలే 150వ సినిమా విషయంలో ఊగిసలాటతో ఉన్న చిరంజీవి.. ఇప్పుడు కమల్ హాసన్ డైరెక్షన్ లో నటిస్తున్నారన్న వార్త వస్తే.. ఇంకేమైనా ఉందా. నేషనల్ వైడ్ గా.. పెద్ద సెన్సేషన్ అవడం ఖాయం. కానీ.. చిరంజీవి వ్యవహారం తెలిసిన వాళ్లకు ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాదని కాస్త మెల్లగా అర్థమవుతుంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే… సినిమాలకు సంబంధించినంత వరకు వర్సెటైల్ టాలెంట్ కమల్ హాసన్ సొంతమని అందరికీ తెలుసు. ఓ నటుడిగా మాత్రమే కాకుండా.. డైరెక్టర్ గా, స్టోరీ రైటర్ గా, గాయకుడిగా ఆయన చేసినన్ని ట్రయల్స్ మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి కమల్ హాసన్ 25 ఏళ్ల క్రితం చిరంజీవితో.. తన డైరెక్షన్ లో ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేశారట.

తను దర్శకత్వం వహిస్తాను కానీ.. ఆ సినిమాలో మాత్రం నటించనని అప్పట్లో చిరంజీవికి కమల్ చెప్పారట. అంతా ఓకే అయినా.. చివరికి ఎందుకో ఆ ప్రాజెక్టు షూటింగ్ వరకు వెళ్లలేదని ఈ మధ్యే కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. చిరంజీవికి తానే ఈ సినిమా గురించి ప్రపోజ్ చేశానని కూడా చెప్పారు. మరి విషయం ఎక్కడ బెడిసిందో కానీ.. చివరికి ఆ సినిమా అలా పెండింగ్ లో పడిపోయిందట. అందరి దర్శకత్వంలో మీరు చేస్తున్నారు. కానీ.. వేరే హీరోల సినిమాలకు డైరెక్షన్ చేయరా అని ఓ విలేకరి అడగడంతో నాటి సంగతిని కమల్ ఇలా గుర్తుచేసుకున్నారు.

150వ సినిమాకు దర్శకుడిగా ఎవరిని ఫైనల్ చేయాలా అన్న విషయంలో దిక్కులు చూస్తున్న చిరంజీవికి.. ఈ విషయం గుర్తొచ్చి కమల్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -