Monday, April 29, 2024
- Advertisement -

పిల్లలను క్యాష్ చేసుకుంటున్న రైల్వే

- Advertisement -

మీరు రెగ్యులర్ గా ట్రైన్ జర్నీ చేస్తుంటారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కొన్నాళ్లుగా చార్జీలు పెంచుతూ జనంపై భారం వేస్తున్న రైల్వే శాఖ.. ఇప్పుడు మళ్లీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ సారి తెలివిగా.. చార్జీలు పెంచిన విషయం ఎవరికీ అర్థం కాకుండానే.. క్యాష్ చేసుకునేలా తెలివి ప్రదర్శించింది.

మామూలుగా.. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు.. ఇన్నాళ్లూ మామూలు జర్నీ టికెట్ కైనా.. రిజర్వేషన్ (బెర్త్/చైర్ కార్) టికెట్ కైనా.. హాఫ్ టికెట్ చార్జ్ మాత్రమే వసూలు చేసేవారు. కానీ.. రైల్వే కొత్త నిర్ణయం ప్రకారం.. ఇకపై ఫుల్ టికెట్ చార్జీని తీసుకోనున్నారు. ఇందుకు తగ్గట్టు రిజర్వేషన్ ఫారాల్లో కూడా మార్పులు చేయనున్నారు.

అంతే కాదు. ఇందులో ఓ విచిత్రమైన నిర్ణయాన్ని కూడా రైల్వే ఇంప్లిమెంట్ చేస్తోంది. పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమో కాదో.. రిజర్వేషన్ ఫామ్ లో టిక్ చేయాలట. స్పెషల్ బెర్త్ కావాలంటే ఫుల్ చార్జీ తీసుకుంటారని.. అలా కాకుండా తల్లిదండ్రులతోనో, కుటుంబ సభ్యులతోనే బెర్త్ షేర్ చేసుకుంటామంటే మామూలుగానే 50 శాతం చార్జ్ చేస్తారని అధికారులు చెబుతున్నారు.

ఈ వివరాలను ఇప్పటికే.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లు, డివిజన్లకు కేంద్రం సమాచారం పంపింది. రిజర్వేషన్ సిస్టమ్ లో తమ సూచనలకు తగ్గట్టు మార్పులు చేసుకోవాలని స్పష్టం చేసింది. వీలైతే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి.. అంటే కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చిన మరు క్షణమే.. పిల్లల రిజర్వేషన్ చార్జీల బాదుడు కార్యక్రమం మొదలు పెట్టేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -