Saturday, May 4, 2024
- Advertisement -

రీమేక్‌లకు నో చెబుతూనే..మళ్లీ ఒకే చేసేసిన చిరు!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్‌ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపడం లేదు. రీసెంట్‌గా వచ్చిన భోళా శంకర్ అయితే పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టులపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ఇకపై రీమేక్ సినిమాలు చేయవద్దని నిర్ణయానికి వచ్చారట చిరు.

ఇక భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత బింబిసార దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమాకు ఒకే చెప్పారు చిరు. ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బ్రా డాడీ’కి అఫీషియల్ రీమేక్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా మొత్తం ఫాంటసీ నేపథ్యంలోనే సాగనుంది.దీంతో చిరు రీమేక్ లకు గుడ్ బై చెబుతారని భావించిన తిరిగి ఓకే చెప్పడం చర్చకు దారితీసింది.

ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించనుండగా, ఛోటా కె నాయుడు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.గతంలో చిరు చేసిన ఫాంటసీ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి బ్లాక్ బాస్టర్ హిట్ కాగా ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -