Monday, April 29, 2024
- Advertisement -

ప్రశాంత్ వర్మతో చిరు..క్రేజీ మూవీ!

- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో సినిమాకు టైటిల్ కాగా దీనికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేయగా చిరు కెరీర్‌లో ఇది 156వ సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజాగా చిరు సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమాను చేయనున్నారు. వాస్తవానికి సైరా నరసింహారెడ్డి కంటే ముందు వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉండగ అనుకోని కారణాలతో వాయిదా పడింది.

రీసెంట్‌గా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో క్లాసిక్ హిట్ కొట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరు హాజరుకాగా అది మరింత హైప్ తీసుకొచ్చింది. చిరంజీవిని ఇటీవల కలుసుకున్న ప్రశాంత్ వర్మ..ఓ స్టోరీ చెప్పగా అది చిరుకు నచ్చేసిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -