Friday, May 10, 2024
- Advertisement -

ఈ జిల్లాలో ఎవరు గెలిస్తే వారిదే అధికారం?

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పై అన్ని పార్టీలు ఓ క్లారిటీకి రాగా త్వరలోనే పూర్తిస్థాయి లిస్ట్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లో రెండు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. ఆ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది.

గత ఐదు దఫాల ఎన్నికలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ఇంతకీ ఆ జిల్లా ఏంటనుకుంటున్నారా..పశ్చిమ గోదావరి. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకుంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. 1999 నుండి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 1999లో టీడీపీ 180 సీట్లతో అధికారంలోకి రాగా పశ్చిమగోదావరి జిల్లాలో 16 సీట్లకు గాను 14 గెలుపొందింది.

ఇక 2004లో వైఎస్ కాంగ్రెస్ పార్టీని 188 సీట్లతో అధికారంలోకి తీసుకురాగా ఇక్కడ 12 స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత 2009లో 156 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా 9 స్థానాలను పశ్చిమగోదావరిలో గెలిచింది. 2014లో టీడీపీ విజయం సాధంచగా ఈ జిల్లా నుండి 14 స్థానాల్లో గెలుపుబాట పట్టింది. ఆ తర్వాత 2019లో వైసీపీ 151 స్థానాల్లో గెలవగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో ఈ సారి ఈ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -