Saturday, April 27, 2024
- Advertisement -

గుంటూరు కారం..వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం మిక్స్‌ డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే వసూళ్లలో మాత్రం సత్తాచాటింది మహేష్ మూవీ. నాలుగు రోజుల్లో ఈ సినిమా 134 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు వెల్లడించారు.

ఏరియాల పరంగా చూస్తే నాలుగోరోజు నైజాం ఏరియాలో రూ. 3.5 కోట్లు,సీడెడ్ (రాయలసీమ) – రూ. 1.48 కోట్లు,ఉత్తరాంధ్ర (విశాఖ) – రూ. 1.21 కోట్లు,ఉభయగోదావరి జిల్లాల్లో రూ.1.20 కోట్లు, గుంటూరులో రూ.74 లక్షలు,కృష్ణా జిల్లాలో రూ.70 లక్షలు,నెల్లూరులో రూ.38 లక్షలు వసూలు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సత్తాచాటింది గుంటురు కారం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 102 కోట్లు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 9 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 20 కోట్లు వచ్చాయి. టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 132 కోట్లు. మొత్తంగా మిక్స్‌ డ్ టాక్‌ని సొంతం చేసుకున్న వసూళ్లలో మాత్రం సత్తాచాటింది గుంటూరు కారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -