Sunday, April 28, 2024
- Advertisement -

మెగాస్టార్ అల్లుడు హీరోగా.. ఎప్పుడంటే..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీజతో పెళ్లి టైంలోనే కళ్యాణ్ లో హీరో అయ్యే లక్షణాలు చాలానే ఉన్నయాని.. మెగాస్టార్ తో చాలామంది చెప్పారంట. ఈ క్రమంలో.. కళ్యాణ్ హీరోగా తెరంగేట్రం చేయడం ఖాయమని.. సొంత ప్రొడక్షన్ హౌస్ లో అతడి సొంత సినిమా ఉంటుందని అతడి తొలి సినిమా బాధ్యతలు శ్రీజ చూసుకోనుందనే వార్తలు వచ్చాయి.

అయితే ఆ తర్వాత ఆ వార్తలను చిరంజీవి ఖడించారు. తన అల్లుడు కళ్యాణ్ కి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు. కట్ చేస్తే.. విశాఖలో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్‌లో కల్యాణ్ మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ సొంత డ్యాన్స్ ఫ్లోర్‌పై అతడు కొంతకాలంగా పాపులర్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

పర్యనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్‌, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు మరో వైపు, గత కొన్ని రోజులుగా యువ దర్శకులు చెప్పే కథలు కూడా అతడు వింటున్నాడు. ఈ క్రమంలో దీపావళి లోపు ఓ కథను ఓకే చేసి.. పండగ తర్వాత గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మెగాక్యాంప్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -