Tuesday, April 30, 2024
- Advertisement -

క‌డ‌ప‌నుంచి పోటీ అందుకేనా….?

- Advertisement -

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ దాదాపు ఖాయ‌మైన‌ట్లేన‌ని వైసీపీ శ్రేణుల‌నుంచి వినిపిస్తున్నమాట‌. ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత షర్మిళ ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా పాల్గొన‌లేదు. అయితే ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పార్టీ ప్లీన‌రీకి శ‌ర్మిళ హాజ‌ర‌య్యారు.

దీంతో మ‌రో సారి ప్ర‌త్యో రాజ‌కీయాల్లోకి రానున్నారు. షర్మిళ ఎక్క‌డ‌నుంచి పోటీ చేస్తాద‌నే దానిపై కొన్ని నియేజ‌క వ‌ర్గాల పేర్లు వినిపించాయి. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ‌, విశాఖ‌, ఒంగోలు ప్రాంతాల‌నుంచి పోటీ చేస్తార‌నె వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ప్ర‌ధానంగా ఒంగోలు నుంచె పోటీ చేస్తాద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు తెర‌పైకి మ‌రో కొత్త పేరు వ‌చ్చింది. దీని వెనుక భారీ వ్య‌హమే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ‌నుంచి వైఎస్ కుటుంబంనుంచి అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి నేప‌థ్యంలో షర్మిళ‌ను ఎందుకు తెర‌మీద‌కు తెస్తున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాఫ్‌క్‌గా మారింది.

అవినాష్‌రెడ్డిని మార్చాల‌ని జ‌గ‌న్ ఫిక్స్ అయ్యార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అవినాష్ ఎక్క‌డి కెల్లినా ఎటువంటి హంగామా ఉండ‌దు. ఎటువంటి గొడ‌వ‌లు పెట్టుకోడు. ఇదంతా మంచిదే కాని ఇక్క‌డే స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తోంది. పార్టీ కార్య‌క్ర‌మాల్లో దూకుడు త‌క్కువ‌. దీంతో పార్టీ కేడ‌ర్‌ను అక‌ట్టుకోలేక పోతున్నాడు. ఎంపీ స్థాయి వ్య‌క్తి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క‌పోతె భ‌విష్య‌త్తులో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఎదుర్కోలేమ‌నె భావ‌న పార్టీ క్యాడ‌ర్‌లో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో దూకుడు అవ‌స‌రం.

గ‌తంలో జ‌గ‌న్ అయినా, వైఎస్‌, వివేకానంద‌రెడ్డి అయినా కేడ‌ర్‌లోకి దూసుకు పోయి నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చేవారు. అందుకె అవినాష్‌కు పార్టీలో ఏదోక ప‌ద‌వి ఇచ్చి ఆయ‌న స్థానంలోవేరొక‌రిని తీసుకురావాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనె షర్మిల పేరు తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -