Thursday, May 16, 2024
- Advertisement -

వ‌య‌స్సు రీత్యా ఎక్కువ సీన్లు చేయ‌లేక‌పోతున్న చిరు

- Advertisement -

10 సంవ‌త్స‌రాల త‌రువాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చిరు ‘ఖైదీ నెంబర్ 150స సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా త‌రువాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా మూవీలో న‌టిస్తున్నాడు చిరు.ఈ సినిమాలో చిరు అంత యాక్టివ్‌గా చేయ‌లేక‌పోతున్నాడ‌ని సమాచారం.సినిమాలో ఎక్కువ యాక్ష‌న్ సీన్స్ ఉండ‌టంతో సీన్‌,సీన్‌కు చిరు గ్యాప్ తీసుకుంటున్నారని అందుకే సినిమా ఆల‌స్యం అవుతుంద‌ని తెలుస్తుంది.

సైరా సినిమా  స్వాంతత్య్రం నాటి క‌థ కావ‌డంతో సినిమాతో ఎక్కువ వార్ ఎపిసోడ్స్ ఉన్నాయ‌ని, వాటిలో చిరు న‌టించ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నార‌ని స‌మాచారం. వ్యాయామాలు చేస్తూ ఆయన తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకున్నప్పటికీ రోజులో మాత్రం ఎక్కువ సీన్లు చేయలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం. చిరంజీవికి ఇప్పుడు 62 సంవ‌త్స‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌రువాత కొర‌టాల శివ‌తో మ‌రో మూవీ ప్లాన్ చేస్తున్నాడు చిరు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -