Friday, April 26, 2024
- Advertisement -

బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

- Advertisement -

ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారిగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలంటే ఐటెం సాంగ్ కంపల్సరీ. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య -2 లో ఆ అంటే అమలాపురం, రింగ రింగా సాంగ్స్ అభిమానులను ఫిదా చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం లో కూడా ఓ ఐటెం సాంగ్ అభిమానులను అలరించింది.

Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

ఇప్పుడు పుష్పలో కూడా ఐటమ్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశారట. ఈ స్పెషల్ సాంగ్ లో బన్నీతో కలిసి మెగాస్టార్ కూడా స్టెప్పులు వేయనున్నాడట. స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తళుక్కున మెరిసి అల్లు అర్జున్ తో కలసి స్టెప్స్ వేయనున్నారట. బన్నీ, చిరంజీవి ఓకే సాంగ్ లో కనిపించి స్టెప్పులు ఇరగ దీస్తే థియేటర్లు దద్దరిల్లి పోళ్లిపోవడం ఖాయమే ఇక.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -