Thursday, April 25, 2024
- Advertisement -

స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

- Advertisement -

తెలుగు స్టార్ హీరోల ఫాలోయింగ్ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కావడం లేదు. తమిళ, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో కూడా తమ మార్కెట్ ని పెంచుకున్నారు. తెలుగులో తాము నటించిన సినిమాలను ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా ఆదరణ పొందుతున్నారు. మరోవైపు తెలుగు స్టార్ హీరోల సినిమాలను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లోనూ, అక్కడ టీవీ ఛానళ్ల లోనూ విడుదల చేస్తున్నారు. తెలుగు హీరోల సినిమాలకు యూట్యూబ్లో లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. టీవీ శాటిలైట్ హక్కులు కూడా భారీగా పలుకుతున్నాయి.

ఈ ప్రయోజనాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలుగు స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ ను భారీగా పెంచుతున్నారు. తెలుగు అగ్ర హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కి రూ. 65 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. పవన్ నటిస్తున్న మరో మూడు సినిమాలకు కూడా ఇదే రేంజ్ లో రెమ్యనరేషన్ అందుకుంటున్నారట. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు తీసుకుంటుండగా సర్కార్ వారి పాట సినిమాకు రూ. 60 కోట్ల దాకా అందుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

ఇక తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ క్రేజ్ వున్న ప్రభాస్ రూ.50 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ. 35 కోట్ల చొప్పున తీసుకుంటున్నారట. చరణ్ శంకర్ తో చేయబోతున్న తన తర్వాతి ప్రాజెక్టుకు, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న ప్రాజెక్టుకు ఇంతకంటే ఎక్కువ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

ఇక అల్లు అర్జున్ ఇప్పటి వరకు కొంత పారితోషికం, కొంత లాభాల్లో వాటా తీసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన పుష్ప -2 సినిమాకు రూ. 50 కోట్ల వరకు అందుకు కుంటున్నారట. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో చేసిన రెండు సినిమాలు సొంత బ్యానర్ లోనే. ఆచార్య సినిమాకు గాను చిరంజీవి రూ. 35 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ, బాలకృష్ణ రూ. 10 నుంచి 12 కోట్ల వరకు అందుకుంటున్నారు. నాగార్జున, వెంకటేష్ సినిమాలను బట్టి పారితోషికం తీసుకుంటున్నారు.

Also Read: టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

మిడ్ రేంజ్ హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, వరుణ్ తేజ్, రామ్, సాయి ధరమ్ తేజ్, గోపీ చంద్ సుమారు రూ.ఐదు కోట్ల వరకు అందుకుంటున్నారు. ఒకప్పుడు అయితే మన స్టార్ హీరోలు ఇంతేసి పారితోషికం తీసుకుంటున్నారని గొప్పలు చెప్పుకునే వాళ్ళమేమో. కానీ ఇప్పటి కరోనా పరిస్థితుల్లో పెద్ద హీరోల రెమ్యునరేషన్ నిర్మాతలకు భారంగా మారింది. కొవిడ్ ఫస్ట్ వేవ్ లో పలు సినిమాల షూటింగులు ఆగిపోగా, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ కాలేక ఓటీటీ బాట పట్టాయి. కొన్ని సినిమాలు 50% ఆక్యుపెన్సీ తో థియేటర్ లో రిలీజ్ అయి నష్ట పోయాయి.

కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. పలు సినిమాల షూటింగ్ నెలల తరబడి సాగుతుండడంతో బడ్జెట్ పెరిగి నిర్మాతలు నష్టాల్లో కూరుకు పోతున్నారు. సరైన సమయానికి థియేటర్లో సినిమాలు విడుదల కాక ఫైనాన్షియర్ లకు వడ్డీలు చెల్లిస్తూ నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాల పాలైన నిర్మాతలను ఆదుకోవడానికి స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -