Wednesday, May 7, 2025
- Advertisement -

80 మంది జీవితలు చిరంజీవి వల్ల రోడ్డు మీద పడ్డాయి..?

- Advertisement -
Chiranjeevis Failure Costed Unemployment For 80 People

ఏదైన సంస్థ నష్టపోతే.. నష్టపోయేది.. కేవలం సంస్థనే కాదు.. అందులో పని చేసేవారు కూడా. సంస్థ డబ్బు నష్టపోతే.. ఉద్యోగస్తులు ఉపాధిని నష్టపోతారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ నష్టాల్లోనే ఉంది. ఎప్పటినుంచైతే మాకి స్టార్ జతకలిసి అది “స్టార్ మా” గా మారిందో, అప్పటినుంచి ఆ ఛానెల్ కి ఏమి కలిసిరావడం లేదు.

ముఖ్యంగా ఆ ఛానెల్ మర్చిపోలేని పీడకల “మీలో ఎవరు కోటీశ్వరుడు”. ఛానెల్ రేంజ్ పెంచుదామని హీరో నాగార్జున స్థానంలో చిరంజీవిని తీసుకొచ్చారు. పారితోషికం బానే ఇచ్చి.. బాగా ఖర్చుపెట్టారు. కానీ సంక్రాంతికి వచ్చిన సినిమా అట్టర్ ప్లాప్ అయినట్లు.. మీలో ఎవరు కోటీశ్వరుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రేక్షకులకి ఈ షో అంటే బోర్ కొట్టిందో లేక మెగాస్టార్ హోస్ట్ చేసే పద్ధతి నచ్చలేదో, అతి దారుణమైన టీఆర్పీ కట్టబెట్టారు.

{loadmodule mod_custom,GA1} 

ఈ షో నష్టాల తీరకముందే.. భారీ రేట్లు పెట్టి కొన్న ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణీ, రెండూ టీవి దగ్గర తుస్సుమన్నాయి. ప్రధానంగా ఖైదీ నంబర్ 150 ఇచ్చిన షాక్ చిన్నది కాదు. జెమిని, ఈటీవి ధాటికి తట్టుకోలేని స్టార్ మా ఏం చేసిందో తెలుసా? ఏకంగా 80 మంది ఉద్యోగస్తులని ఒకేసారి తీసేసింది. అందులో చాలామంది సీనియర్ ఉద్యోగస్తులు కావడం విడ్డూరం. వారికి ఎలాగో కొంత డబ్బు అందుతుంది కాని, మళ్ళీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాల్సిన దుస్థితి. ఈ పరిస్థితికి ఓరకంగా మెగాస్టార్ వైఫల్యం కూడా కారణం. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ తో ఏం చేస్తాడో.. ఈ షో మీద కూడా భారీగానే ఖర్చుపెడుతున్నారు. ఎన్టీఆర్ భారీ పారితోషికం కలుపుకోని.. ఏకంగా 50 కోట్ల బడ్జెట్ వేసారట. మరి మెగాస్టార్ తీసుకొచ్చిన కష్టాలు ఎన్టీఆర్ సహాయంతో తీరుతాయో లేదో చూడాలి. 

{youtube}3Yha8UTl0v4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చిరు పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత‌
  2. ఉయ్యాలవాడను ఆపేసిన చిరు.. రాజమౌళి ఫిక్స్..?
  3. దాసరి సినీ జీవితం లో చిరస్థాయిగా నిలిచిపోయిన టాప్ మూవీస్
  4. పవన్, చిరు కాంబోలో మూవీ.. మెగా ఫ్యాన్స్ కి పండగే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -