Saturday, May 11, 2024
- Advertisement -

పవన్ కళ్యాన్, చిరు మళ్ళీ కలిసారు

- Advertisement -

పవన్ కళ్యాన్ హీరోగా కాజల్ హీరోయిన్‍గా బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కు సిక్వెల్‍గా రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్‍లో వేసిన భారీ సెట్‍లో జరుగుతుంది.

సమ్మర్‍లో రిలీజ్‍కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిరు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో పవన్ కనిపించి మెగా అభిమానులను అనందపరిచారు. ఐతే కొన్ని రోజులుగా సర్దర్ గబ్బర్ సింగ్ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో కనిపించబోతున్నాడు అనే వార్తాలు వచ్చాయి.

కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవినే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సినీ పరిశ్రమలో అనుకుంటున్నారు. మరి నిజంగానే చిరంజీవి పవన్ సినిమాలో కనిపించబోతున్నాడా? అనే విషయం పై సర్దర్ టీం క్లారీటి ఇవ్వలేదు. ఒకవేల నిజంగానే చిరు పవన్ సినిమాలో కనిపిస్తే మెగా అభిమానులకు అది పెద్ద పండగనే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -