Friday, May 3, 2024
- Advertisement -

చోటా కే నాయుడు వర్సెస్ హరీష్‌ శంకర్!

- Advertisement -

టాలీవుడ్‌లో మరో వార్ నడుస్తోంది. సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడుపై ఫైర్ అయ్యారు దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమాకు పనిచేశారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చోటా…హరీష్ శంకర్ తన మాట పట్టించుకునేవాడు కాదని, ప్రతి పనికి అడ్డుపడేవాడని తెలిపారు.

దీనిపై ఫైర్ అయిన హరీష్… ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మీరు ఓ 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాను. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు అని తెలిపారు. పదేపదే తనను అవమానపరిచేలా మాట్లాడటం సరికాదని…ఆ సినిమా సమయంలో మిమ్మల్ని తీసేసి కెమెరామెన్‌తో షూటింగ్ చేద్దామనుకున్నామని షాక్ ఇచ్చారు.

దిల్ రాజు చెప్పడం వల్ల ఆగామని…అయితే ఆ సినిమా ఆశించిన విజయం కాలేదు..కానీ ఏనాడూ మీమీద ఆ నింద మోపలేదన్నారు హరీష్. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగినా, అడగకపోయినా,నా ప్రస్తావన వచ్చినా, రాకున్నా, నన్ను అవమానపరిచేలా మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు. మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా ఇది వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -