Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ చేసే పనుల వల్ల మహేష్ కి తలనొప్పి ..

- Advertisement -

సంక్రాంతి కి విడుదల చెయ్యాలి అనుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ మొదలుఅవడమే బాగా లేట్ అయ్యింది. ఆ తరవాత షూటింగ్ లో చాలా ఆలస్యం జరిగి ఆ సినిమా చాలా స్లో గా వెళుతూ వెళుతూ ఇంకా షూటింగ్ పూర్తి అవ్వకుండా ఉంది.

ఈ సినిమా సంక్రాంతి బరిలోంచి తప్పుకుని ఎప్పుడో సమ్మర్ కి చేరుకుంది. కాగా మహేశ్ కూడా బ్రహ్మోత్సవం సమ్మర్ కి విడుదల చేద్దాం అనుకుంటున్నాడు. పవన్ సినిమా అంత కాకపోయినా బ్రహ్మోత్సవం కూడా చాలా లేట్ గానే స్టార్ట్ అయ్యింది షూటింగ్ కానీ మొదలయ్యాక చాలా ఫాస్ట్ గా లాగించేస్తున్నారు. శ్రీమంతుడు విషయం లో ముందూ వెనకా ఎలాంటి సినిమా లేకుండా జాగ్రత్త పడిన మహేష్ బాబు ఇప్పుడు బ్రహ్మోత్సవం కి కూడా అదే ట్రిక్‌ ప్లే చేయనున్నాడు మహేష్‌.

అయితే ఈ చిత్రానికి ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ పోటీలో ఉండటంతో ‘సర్దార్‌’ ఎప్పుడొచ్చేది తెలిస్తే తన ‘బ్రహ్మొత్సవం’ సినిమాకి డేట్‌ లాక్‌ చేయోచ్చు అనుకొంటున్నాడట. అయితే సర్దార్‌ లేటయ్యే కొద్ది కన్‌ఫ్యూజన్‌ ఏర్పడి  ‘బ్రహ్మొత్సవం’ రిలీజ్‌ డేట్‌ కూడా కన్‌ఫ్యూజన్‌లో పడే అవకాశం ఉండటంతో రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వాలని పివిపి సంస్థ శరత్‌మరార్‌ని కోరిందట.  సో ప్రొడ్యూసర్ పవన్ తో కూర్చుని మాట్లాడి ఈ విషయం మీద ఖచ్చితంగా త్వరలో చెబుతా అని చెప్పారట.

మహేష్ కి ఈ రకంగా కొత్త తలనొప్పి తెస్తున్నాడు పవర్ స్టారుడు.. సినిమా మొదలు పెట్టి ఎప్పుడు మధ్యలో ఆపుతాడో తెలియని పరిస్థితి, మళ్ళీ ఎప్పుడు మొదలెట్టి పూర్తి చేస్తాడో తెలీదు పవన్ దీని వల్ల సమ్మర్ బరిలో మహేష్ కి పెద్ద చిక్కు గా ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -