ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారి మీద ఈ మధ్య కాలం లో విమర్శలు తగ్గాయి అని చెప్పాలి. అప్పట్లో ఘాటుగా విమర్శలు మీద సైలెంట్ గా ఉన్న బాబు మళ్ళీ అమరావతి శంకుస్థాపన తరవాత వస్తున్న విమర్శల విషయంలో కూడా మిన్నకున్నారు. కానీ ఈ మధ్య కాలం లో బాబు కాస్త ఘాటుగానే స్పందించారు.
తిరుపతి లో జరుగుతున్న మేధోమధన సదస్సు ని తనకి అనుకూలంగా మలచుకున్న ముఖ్యమంత్రి ఈ సందర్భాన్ని వాడుకుని ప్రత్యేక హోదా అంశం విషయంలో తన భావాన్ని వెల్లడించారు. విభజన వలన ఏపీ కి తీవ్ర అన్యాయం జరుగుతోంది అంటూ ఆయన ప్రసంగం సాగింది ” విభజన జరిగిన తీరు నుంచీ అన్నీ బాధాకరమైన అంశాలే, కట్టుబట్టలతో తీవ్ర అన్యాయంతో అక్కడ నుంచే ఏపీ వారిని గెంటేసారు . కేంద్రం ఇలాంటి పరిస్థితి లో ఖచ్చితంగా చేయూత ఇవ్వాల్సి ఉంది. ప్రత్యేక హోదా ప్యాకేజీ లని సాధించేవరకూ రాజీ పడడం నాకు ఇష్టం లేదు, మా ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాం.” అని బాబు స్పష్టం చేసారు. ” మేము ఎవరితోనూ రాజీ పడే ఉద్దేశం లో లేము. కేంద్రంతో రాజీ పడుతున్నాం అని ఊహాగానాల్లో ఉన్నారు ప్రతిపక్షం వారు అదంతా ఒట్టి అబద్దం. పొరుగు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందాయో అంతవరకూ కేంద్రం సాయం అందించాల్సిందే” అని ఆయన కాస్త గట్టిగానే మాట్లాడారు. ఎంత అభివృద్ధి జరిగితే అంతగా ఇక్కడ నుంచే కేంద్రానికి పన్నులు రూపంలో దీర్ఘకాలికంగా రెవెన్యూ వస్తుంది అని ఆయన గుర్తు చేసారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మోడీ అసలు వ్యతిరేకంగా లేరు అని ఆ రకమైన వార్తలు స్ప్రెడ్ చెయ్యడం ఇతరుల మూర్ఖత్వం అని చెప్పుకొచ్చారు బాబు. ” ఇక్కడ అమరావతి గురించి ప్రస్తావిస్తూ, ఏపీ లో పెట్టుబడుల గురించి బ్రిటన్ లో సైతం మోడీ మాట్లాడుతున్నారు అంటే అది ఆయనకీ మనపట్ల ఉన్న చిత్తశుద్ధి కి నిదర్సనం”
