Monday, May 13, 2024
- Advertisement -

రొటీన్ కథలు మనకి ప్లాప్ – వాళ్లకి హిట్

- Advertisement -

బాహుబలి – కంచె లాంటి చాలా డిఫరెంట్ సినిమాలు తెలుగు లో విడుదల అయిన సమయంలో తెలుగు సినిమా ఖ్యాతి సూపర్ గా ఎదుగుతోంది. కొత్త కొత్త పంథా ఇప్పుడే వస్తోంది అని సంతోషంగా ఉన్నాం. మరొక పక్క రొటీన్ కథలకి తెర పడకుండా బ్రూస్ లీ – అఖిల్ లాంటి సినిమాలు అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉన్నాయి.

కానీ సినిమాల ఫలితం మాత్రం ప్రేక్షకుడు వెంటనే రుచి చూపించేస్తున్నాడు. మరొక పక్క బాలీవుడ్ – కాలీవుడ్ లని చూస్తే అక్కడ సినిమాలు వింతగా అనిపిస్తున్నాయి. తమిళ నాట విడుదల అయిన అజిత్ సినిమా వేదాళం , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఖాన్ ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఈ రెండు సినిమాలు పరమ రొటీన్ కంటెంట్ తో తెరకెక్కినవే అయినా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

 ఒక పేద కుర్రాడు ఒక బాగా గోప్పింట్లోకి అడుగు పెట్టినపుడు ఆ ఇంట్లో వారి కూతురు ని ప్రేమించడం ఎలాంటి పరిస్థితి కి దారి తీసింది అసలు అతను అలా రావడానికి కారణం ఏంటి అనే కథ ఈ సినిమా కి మెయిన్ పాయింట్. ఇలాంటి కథలు మనం చాలా నే చూసాం. సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవనే చెప్పాలి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ – ఫ్యామిలీ ట్రీట్ మెంట్ తో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి తెలుగు – తమిళ్ లో. సేమ్ టు సేమ్ స్టోరీనే దరువు శివ తిప్పి తీశాడు.

 కానీ అజిత్ కి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. దీపావళి రోజున విడుదల అయ్యి దాదాపు యాభై కోట్లు కలక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలనీ విమర్శకులు తెగ తిడుతున్నా కూడా జనాలు మాత్రం కలక్షన్ లతో వారి నోళ్ళు మూయిస్తున్నారు. అదే పరిస్థితి మనకి మాత్రం జరగడం లేదు . బ్రూస్ లీ నలభై కోట్లకి కాస్త ఎక్కువగా దాటి వెళ్ళిపోయింది. కాగా అఖిల్ ఎంత మేర చేస్తుందో చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -