Friday, May 17, 2024
- Advertisement -

గబ్బర్‌సింగ్ మౌనానికి లెక్కలేదు..!

- Advertisement -

ఎలక్షన్స్‌కు ముందు హడావిడిగా పార్టీ పెట్టి, రాజకీయాలు భ్రష్టు పట్టాయి. రాజకీయ నాయకులు ఎవరి స్వార్థానికి వారు లబ్ది పొందుతున్నారు.

అందుకే ఇలాంటి తరుణంలో నేను పార్టీ పెట్టటానికి నిర్ణయం తీసుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చానని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్ పార్టీ ఆవిర్బావ సభలో మాట్లాడిన మాటలు ఇవి. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని, ప్రజల తరపున పోరాడతానని ఎన్నో ప్రగల్భాలు పలికారు.

మొన్నటికి మొన్న నోటుకు ఓటు కేసులో రెండు రాష్ట్రాలు కొట్టుకుంటుంటే.. అప్పుడప్పుడు ట్విట్టర్‌లో స్పందించి, తర్వాత ఒక రోజు అంటి అంటనట్లుగా విమర్శలు చేసి సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆంద్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్లెక్కి నినాదాలు చేస్తుంటే.. ఈయన ఇప్పుడు ప్రశ్నించడట. మరెప్పుడు ప్రశ్నిస్తారో అని ఆంద్ర రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఆయన మాటే అభిమానులకు వేద వాక్కు. అతను ఏం చేస్తే  ఫ్యాన్స్ అదే చేస్తారనే ధీమా. ఆల్మోస్ట్ చాలా సందర్బాల్లో అలా చేశారు కూడా. ఇవి నచ్చే…. ఆయనగారు ఓ పార్టీని స్థాపించారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తానని లక్షల ముందు ప్రమాణం చేశారు. కానీ ఇపుడు అలా ప్రశ్నించే టైమ్ లేదంటూ తప్పించుకు తిరుగుతున్నారు.

గబ్బర్ సింగ్  తిక్కకు లెక్కుందో లేదో తెలియదు గానీ…. ఆయన మౌనానికి మాత్రం లెక్కే లేదంటూ నెటిజన్లంటున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా ఇపుడు యాక్టివ్ రోల్ పోషించకపోవడంపై…. సర్వత్రా విమర్శలు ఊపందుకుంటున్నాయి. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్నవాడు…ఎక్కడా కనిపించడే అంటూ నెటిజన్లు తమ కామెంట్లను ఉదృతం చేశారు. మొన్నటి వరకూ లైట్ తీసుకున్న మిగతా పార్టీలు,సామాన్యులు కూడా ఇపుడు పవన్ పై డైరెక్ట్ అటాక్ కు సిద్దమవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -