Sunday, April 28, 2024
- Advertisement -

‘పుష్ప 3’..క్రేజీ రూమర్!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక పుష్ప సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతం పూర్తి కాగా అప్పుడే ఈ సినిమాకు మరో సీక్వెల్ పుష్ప 3కి సంబంధించిన రూమర్స్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మూడో పార్ట్‌లో విజయ్ దేవరకొండ పాత్ర కీలకంగా ఉండనుందట.

పుష్ప 3లో విజయ్ దేవరకొండ ను రెండు డిఫరెంట్ పాత్రల్లో చూపించబోతున్నారట. అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లను తండ్రీకొడుకుల పాత్రలలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ఇక పుష్ప 2లో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -