Saturday, April 27, 2024
- Advertisement -

ఫామ్‌లోకి వచ్చిన రోహిత్..జడేజా అదుర్స్!

- Advertisement -

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ అదరహో అనిపించారు. ముఖ్యంగా ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాటుతో సమాధానం చెప్పాడు. సెంచరీతో చెలరేగగా గాయం నుండి కొలుకోని జట్టులోకి వచ్చిన జడేజా సైతం అద్భుత సెంచరీతో శభాష్ అనిపించుకున్నాడు.

ఒఒక దశలో 33 పరుగులకే కీలక మూడు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈదశలో క్రీజులో వచ్చిన జడేజా…రోహిత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ 196 బంతుల్లో 131 పరుగులు చేసి ఔట్ అవ్వగా రవీంద్ర జడేజా 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించాడు. 62 పరుగుల వద్ద రనౌట్‌గా వెను దిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -