Thursday, May 16, 2024
- Advertisement -

ప‌వ‌న్ …గ‌బ్బ‌ర్‌సింగ్-3 నిజ‌మేనా…?

- Advertisement -

హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది. మూడో పార్టుకు దర్శకుడు కూడా ఖరారు అయ్యాడు. ఈ సినిమాకు ప్ర‌భువేవా ద‌ర్శ‌కుడు. ప్ర‌భుదేవానే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇది వరకూ సల్మాన్ తో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’ సినిమాల‌కు ప్ర‌భుదేవా దర్శకత్వం వహించారు. ప్రభుదేవ ఇప్పుడు సల్లూ సూపర్ హిట్ దబంగ్ కు మూడో పార్టును తీయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

హిందీలో దబంగ్ తొలి పార్టు 2010లో వచ్చింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు దబంగ్-2 వచ్చింది. తొలి పార్టు సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ కలెక్షన్ల చరిత్రను కొత్తగా లిఖించింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకూడా రీమేక్ అయ్యింది. తెలుగులో గ‌బ్బ‌ర్‌సింగ్‌గా ప‌వ‌న్ న‌టించాడు. రెండో పార్టు డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక హిందీలో దబంగ్-2 వచ్చినా ఫస్టు పార్టు రేంజ్ లో కాదు. ఇప్పుడు మూడో పార్టుకు రెడీ అవుతున్నారట. మూడో పార్టులో కూడా నటీనటులంతా వాళ్లే ఉంటారని… దర్శకుడు మాత్రం ప్రభుదేవా అని తెలుస్తోంది. హిందీలో మూడో పార్టు వస్తోంది..తెలుగులో కూడా గబ్బర్ సింగ్ -3 వస్తోంది.

తెలుగులోకూడా దీనిలో ప‌వ‌న్ న‌టిస్తారా…? అన్న‌ది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప‌వ‌న్ ఇప్ప‌టికే సినిమాల‌నుంచి త‌ప్ప‌కున్నాడు. టైం అంతా రాజ‌కీయాల‌కే కేటాయించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -