Saturday, May 18, 2024
- Advertisement -

మూడో అభ్యర్థిః జగన్, విజయసాయిల వ్యూహానికి తలవంచిన బాబు

- Advertisement -

20మందికి పైగా ఎమ్మెల్యేలను అనైతికంగా, అక్రమ మార్గాల్లో వైకాపా నుంచి లాక్కున్నాడు. బాబు భజన మీడియా మొత్తం కూడా బాబు అనైతిక రాజకీయాల గురించి కాకుండా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమవుతున్న జగన్ అని వార్తలు వండివార్చింది. ప్రజాస్వామ్యం అని పడికట్టుపదాలు పలికే పవన్ కళ్యాణ్, జయప్రకాష్ నారాయణలాంటి వాళ్ళు కూడా పరోక్షంగా బాబుకే వత్తాసు పలికారు. స్పీకర్ అయితే మరీ అడ్డంగా వ్యవహరించాడు. బాబుకు చెక్ చెప్పడంలో జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ఇలా అయితే జగన్ పార్టీ క్లోజ్ అని చాలా మంది విశ్లేషించారు. అయితే అదంతా కూడా బాబు పంచిన ప్యాకేజ్‌లు, అక్రమ మార్గాల్లో ఎమ్మెల్యేలను బెదిరించి చేసిన రాజకీయమే అన్నది నిజం. ఇప్పుడు అదే విషయాన్ని పరోక్షంగా నిరూపించాడు జగన్.

రాజ్యసభకు మూడో అభ్యర్థిని కూడా నిలబెట్టాలని చంద్రబాబు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు. వైకాపా రాజ్యసభ అభ్యర్థిని కొనేయాలన్న ప్రయత్నం కూడా చేశాడు. వైకాపా ఎమ్మెల్యేల కోట్లాది రూపాయల ఆఫర్స్ ఇస్తూ టిడిపి మంత్రుల స్థాయి నాయకులు, ముఖ్యనేతల నుంచి కాల్స్ వెళ్ళాయి. అయితే బాబు అక్రమ రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న జగన్ ఈ సారి జాగ్రత్తపడ్డాడు. మొత్తం వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాలను రికార్డ్ చేయించాడు. ఢిల్లీ స్థాయిలో పోరాటానికి విజయసాయిరెడ్డి రెడీ అయ్యాడు. అదే విషయాన్ని ఢిల్లీలో జాతీయ స్థాయి మీడియాతో చెప్పాడు విజయసాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన చంద్రబాబు ప్రమాదాన్ని పసిగట్టి వెనక్కితగ్గాడు. ఫిరాయింపు రాజకీయాల పుణ్యమాని ఇప్పటికే పరువు పూర్తిగా పోయిన నేపథ్యంలో మరోసారి ఓటుకు కోట్లు లాంటి సాక్ష్యాలు ఏవైనా బయటికి వస్తే మొత్తానికే మోసం వస్తుందని భయపడ్డాడు. మూడో అభ్యర్థిని నిలబెట్టడంలేదని చెప్పి తన సన్నిహితులైన టిడిపి నేతలకు చెప్పాడు. 20మందికి పైగా ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనడం అసలు విషయమే కాదన్నది నిజం. జస్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలను కొంటే టిడిపి మూడో అభ్యర్థి విజయం కూడా ఖాయం. చంద్రబాబు కూడా ఆ ప్రయత్నాలు గట్టిగానే చేశాడు. అయితే ఈ సారి ముందుగానే అలర్ట్ అయిన జగన్, విజయసాయిరెడ్డిలు చంద్రబాబుకు చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అందుకే చంద్రబాబు మూడో అభ్యర్థిని నిలబెట్టి అనైతిక రాజకీయాలు చేయాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాజకీయ కుట్రలు, వ్యూహాల విషయంలో చంద్రబాబును మించిన వాడు లేడని జాతీయ స్థాయి మీడియా, ఇతర పార్టీల నాయకులు కూడా చెప్తూ ఉంటారు. అలాంటి చంద్రబాబు రాజకీయ వ్యూహాలను జగన్ విజయవంతంగా ఎదుర్కోవడం అంటే అది కచ్చితంగా వైకాపా శ్రేణులకు మోరల్ బూస్టింగ్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -