- Advertisement -

జనసేనలోకి దగ్గుబాటి సురేష్ బాబు.. కారణం ఏంటి..?

- Advertisement -

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. జనసేన పార్టీలో చేరనున్నారా..? అని అడిగితే.. అవును అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటివలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యలంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రారంభ కార్యక్రమానికి సురేష్ బాబు హాజరు కావడం వల్ల ఈ న్యూస్ బయటకు వచ్చింది.

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాధాకృష్ణ లాంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆసక్తి కలిగిస్తోంది. సురేష్ ప్రొడక్షన్లో రూపొందిన గోపాల గోపాల సినిమాలో పవన్ వెంకటేష్‌తో కలిసి నటించారు. ఆ టైంలో దగ్గుబాటి సురేష్‌తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది.

ఈ మైత్రి కారంగానే సురేష్ బాబు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ప్రారంభానికి వచ్చారా? లేదంటే జనసేన తరఫున పని చేయనున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు. సురేష్ బాబు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉంటారు. అలాంటి వ్యక్తి మద్దతు జనసేనకు ఉంటే అది కచ్చితంగా పవన్ పార్టీకి ప్లస్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -