Tuesday, May 21, 2024
- Advertisement -

భూమా అఖిల‌ప్రియ‌ను ఘోరంగా అవ‌మానించిన లోకేష్‌..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పుత్ర‌ర‌త్నం..మంత్రి లోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం గురించి చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. గ‌తంలో కూడా అనేక సంద‌ర్భాల్లో అజ్ణానంగా మాట్లాడి న‌వ్వుల పాల‌యినా లోకేష్‌లో మాత్రం మార్పు శూన్యం అనే చెప్పాలి. భ‌విష్య‌త్ కాబోయో సీఎంతోపాటు పార్టీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల్సిన లోకేష్ త‌న అజ్ణానాన్ని మ‌రో సారి బ‌య‌ట పెట్టుకున్నారు.

పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌భ‌ల‌లో అర్ధవంతంగా, ఆసక్తికరంగా మాట్లాడలేకపోవడం నారా లోకేష్ కు ప్రధాన మైనస్. ఒక ముఖ్యమంత్రి తనయుడిగా, తెలుగుదేశంలాంటి పార్టీకీ కాబోయే భవిష్యనాయకుడిగా చూస్తే, లోకేష్ తన స్టైల్ ఎంతలా మార్చుకోవాల్సి ఉందో మనకు అర్ధమవుతుంది.

తెలుగుదేశం పార్టీకి పెద్దగా చంద్రబాబు ఉన్నా, అసలు కథంతా నడిపించేది లోకేష్ క‌నుస‌న్న‌ల్లో అనేది అంద‌రికి తెలిసిందే. భ‌విష్య‌త్ టీడీపీ రాజ‌కీయాల‌ను న‌డిపించ‌వ‌ల‌సిన అలాంటి లోకేష్, రోజురోజుకూ మరింతగా నేర్చుకుంటూ, బాధ్యతగా వ్యవహరిస్తూ, ఆచితూచి ఆకట్టుకునే మాటలు మాట్లాడాల్సింది పోయి, సొంతడబ్బా కొట్టుకోవడంపైనే దృష్టి పెట్టడం గమనార్హం.

తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ దేశంలోనే అత్యంత చిన్న వయసు ఉన్న మంత్రిని నేనే, 34 ఏళ్లకే మంత్రిని అవుతానని అనుకోలేదని చెప్పారు. ఇంత చిన్న వయసులో మంత్రిగా అవకాశం వచ్చింది, దీన్ని మీకోసం వినియోగిస్తా అని చెప్పడం లోకేష్ ఉద్దేశ్యం కావచ్చు. కానీ దేశంలో నేనే తక్కువ వయసున్న మంత్రిని అని చెప్పేసి మ‌రోసారి మీడియాకి దొరికిపోయారు.

లోకేష్ భాగస్వామిగా ఉన్న మంత్రివర్గంలోనే భూమా అఖిల ప్రియ కూడా మంత్రిగా ఉన్నారు. ఆమె వయసు 30 లోపే. లోకేష్ కన్నా నాలుగేళ్ళు చిన్న. ఆ సంగతి మర్చిపోయిన లోకేష్ నేనే తక్కువ వయసున్న మంత్రిని అని చెప్పుకున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా లోకేష్ కన్నా తక్కువ వయసున్న మంత్రులు కచ్చితంగా ఉండే ఉంటారు. ఇలా సొంత డ‌బ్బా కొట్ట‌డంలో తండ్రిని మించిపోయాడ‌ని సోషియ‌ల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -