- Advertisement -

గురువారం మధ్యాహ్నం నుంచి ప్రీ- ఆర్డ‌ర్లు చేప‌డుతున్న గూగుల్‌…..

- Advertisement -

రోజుకో రోజు కొత్త టెక్నాల‌జీతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఎన్ని ఫోన్లు వ‌చ్చినా ఏ కంపెనీ పోన్ ప్ర‌త్యేక‌త‌లు దానివె. తాజాగా ఇప్పుడు గూగుల్‌ కొత్తగా తీసుకొచ్చిన పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌ ఎక్స్‌ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు గూగుల్‌ వీటి ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. వయా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా వీటిని అందించనున్నారు.

గూగుల్‌ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. నవంబర్‌ 2 నుంచి పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను, నవంబర్‌ 15 నుంచి పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్టు పేర్కొంది. కొన్ని ఎక్స్‌క్లూజివ్‌ ప్రీ-ఆర్డర్‌ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశపెట్టింది. వీటిలో పిక్సెల్‌ నుంచి అప్‌గ్రేడ్‌ అయిన కొనుగోలుదారులకు 50 శాతం బైబ్యాక్‌ గ్యారెంటీని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా ఈఎంఐ లావాదేవీలు జరిపితే రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను, ఎంపికచేసిన ఫోన్‌ మోడల్స్‌ ను ఎక్స్చేంజ్‌ చేసి వీటిని కొంటే రూ.5000 తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫేస్‌బుక్‌లో నిర్వహించే కంటెస్ట్‌లో గెలుపొందిన ఐదుగురు ఎంపికచేసిన విన్నర్లకు గూగుల్‌ కొత్త డేడ్రీమ్‌ వ్యూ వీఆర్‌ హెడ్‌సెట్‌ కూడా ఇవ్వనున్నారు. ఈ కంటెస్ట్‌ను అక్టోబర్‌ 25 వరకు నిర్వహించనున్నారు. గూగుల్‌ టెలికాం ఆపరేటర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

ఈ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌ చేసుకునే కొనుగోలుదారులకు ఆరు నెలల పాటు అదనంగా 120 జీబీ డేటాను అందించనున్నారు. రిలయన్స్‌ జియో యూజర్లైతే ఏకండా మొత్తంగా రూ.14,999 ప్రయోజనాలను పొందనున్నారు. అంటే ఏడాది పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 750జీబీ డేటా, ఎస్‌ఎంఎస్లు, రూ.9999 విలువైన జియో యాప్స్ వీరికి అందనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -