Sunday, May 19, 2024
- Advertisement -

ఆస్పత్రిలో దక్ష..ఫోటో వైరల్

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ దక్ష నగర్కార్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఆస్పత్రిలో తనకు సర్జరీ జరిగిన విధానం, తను పడ్డ బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ సందర్భంగా పలు ఫోటోలు షేర్ చేస్తూ కొన్ని రోజులుగా నేను స్ట్రెచర్‌పై తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు.

నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్ గా నిలిచారు. ఇలాంటి సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్ కి కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉందని ఫిలాసఫీ చెప్పుకొచ్చింది. అయితే ఇంతకు తనకు ఏం సర్జరీ జరిగిందో మాత్రం చెప్పలేదు. ఇక ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని దక్షకు మద్దతుగా నిలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -