Friday, May 17, 2024
- Advertisement -

దీక్షను ధన్‍రాజ్ అందుకు పిలిచాడట..?

- Advertisement -

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సభ్యులందరూ.. అక్కడ తాము గడిపిన మధుర క్షణాలను.. ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. వివదాలకు పోకుండా.. ఆలోచించి.. జవాబు ఇచ్చాడు. షోలో భాగంగా తమకు యాంటీగా ఉన్న సభ్యుల గురించి చెడుగా ఏం మాట్లాడలేదు. అదొక ఆటంటూ.. బిగ్ హౌస్ లో జరిగిన గొడవల గురించి కొట్టిపారేస్తున్నారు. కానీ.. దీక్ష మాత్రం అందరికంటే.. బిన్నంగా.. ధన్‌రాజ్‌పై సంచలన కామెంట్లు చేసింది.

బిగ్ బాస్ షోలో అతను తనకి మొదటి నుంచి వ్యతిరేకంగా వుండటానకి బలమైన కారణం వుందంటూ కుండబద్ధలు కొట్టింది. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీక్ష మాట్లాడుతూ.. ‘బంతిపూల జానకి సినిమా చేస్తున్న సమయంలో ధన్‌రాజ్ ప్రవర్తన సరిగా లేదు. అందుకే నేను బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ అతడితో దూరంగానే వున్నాను. ఆ కారణంగానే షోలో అతను నాకు వ్యతిరేకంగా వున్నాడు. నా గురించి తెలియని వాళ్లు విమర్శిస్తే పర్లేదు కానీ తెలిసిన ధన్‌రాజ్ కూడా విమర్శించడంతో నాకు చాలా బాధేసింది. నేను హౌస్‌లోకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి అతను నాకు వ్యతిరేకంగా వుండటం నాకు నచ్చలేదు’.

వాస్తవానికి.. మా ఇద్దరి మధ్య సినిమా వరకు మంచి రిలేషన్ ఉంది. బయట మేమిద్దరం ఎప్పుడూ కలవలేదు. ధన్‌రాజ్ చాలాసార్లు బయట కలుద్దామని అడిగాడు. నేను దానికి ఒప్పుకోలేదు. నాకలా కలవడం నచ్చదు. బహుశా.. అదే మనసులో పెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌లో ధన్‌రాజ్ అలా ప్రవర్తించాడేమో అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు దీక్ష చేసిన కామెంట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -