Friday, March 29, 2024
- Advertisement -

మళ్ళి అదే నడుమ అందాలు

- Advertisement -

విభిన్న చిత్రాలను రూపొందిచడమే కాదు ఆ చిత్రాలకు పబ్లిసిటిని సమర్థంగా చేయడంలో దర్శకుడు రాజమౌళి దిట్ట. ఇదే తరహాలో తన కలల చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’ కు విస్తృత ప్రచారం చేసిన ఈ దర్శకుధీరుడు ప్రస్తుతం ‘బాహుబలి 2’ కు కూడా హైప్ తీసుకురావడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నాడట..అందులో భాగంగా ‘బాహుబలి’ సీక్వెల్ లో ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లుగా వినిపిస్తోంది.

అందుకోసం ఇప్పటికే డస్కీ బ్యూటీ దీపికా పదుకొణేతో జక్కన్న అండ్ టీమ్ చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాదు దీపికాను ఓ హాట్ అవతార్ లో చూపింనాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి వన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నడుమ అందాలను తెర అద్భుతంగా ఆవిష్కరించిన జక్కన్న ఈసారి దీపికా ను అదే తీరున చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

దీంతో పాటు ఈ మూవీలో దీపికా నటిస్తే ఖచ్చితంగా బిజినిస్ రేంజ్ మారుతుందని భావిస్తున్నాడట. నిజానికి బాలీవుడ్ లో ‘బాహుబలి’ కి ఫుల్ హైప్ క్రియేట్ చేసింది కరణ్ జోహార్ అనే చెప్పాలి. కరణ్ సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకం పై బాహుబలి విడుదల్వడంతోనే ఉత్తరాదిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ సీక్వెల్ కు కరణ్ అండతో పాటు దీపికా పదుకొణే పాపులారిటీ కూడా తోడైతే, ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ పండిట్స్ అంటున్నారు. ఏదైతేనేం కేవలం బిగినింగ్ తోనే ఎవరు మర్చిపోలేని అవార్డుల్ని రివార్డుల్ని ఎన్నో పొందిన రాజమౌళి అండ్ టీమ్ రాబోయే సెకెండ్ పార్ట్ తో ఏ స్థాయి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి..!

{youtube}v=YmZD82VZcEs{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -