Monday, April 29, 2024
- Advertisement -

గాయపడిన మహిళ ప్రాణాలు కాపాడిన సూర్య!

- Advertisement -

తమిళనటుడు సూర్య కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే సూర్య రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. తన మానవత్వంను చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను తన వాహనంలో ఎక్కించుకొని చికిత్స నిమిత్తం తరలించాడు.

సూర్య సహాయం అందరి మన్ననలను అందుకుంది. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. తన తాజా చిత్రం 24 సినిమా షూటింగ్ నిమిత్తం సూర్య చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఈడిగపల్లెకు వచ్చాడు. గ్రామ సమీపంలోని క్వారీ వద్ద రాత్రి వరకు షూటింగులో పాల్గొన్నాడు. ఐతే రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు.

మార్గమధ్యలో వలసపల్లె వద్ద ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మహిళ రోడ్డుపై పడి ఉంది. ఆమె రోడ్డు పై పడి ఉండటాన్ని హీరో సూర్య గుర్తించాడు. ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని, చికిత్స నిమిత్తం తిరుపతి తరలించాడు. మదనపల్లె చేరుకున్నక ఆ మహిళ పరిస్థితిపై ఆరా తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -