- Advertisement -

బహుబలికి పోటిగా బాలయ్య?

- Advertisement -

బాలకృష్ణ వందో సినిమాని రాజమౌళి తీస్తున్న బాహుబలి పార్ట్ 2 కి పోటీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. బాహుబలి లాగే అద్భుతమైన గ్రాఫిక్స్ తో బాలకృష్ణ సినిమా కూడా రుపొందవచ్చు.

చారిత్రక ప్రధాన్యమున్న గౌతమి గౌతమీపుత్ర శాతకర్ణి రాజుల కాలం నాటి కథ కనుక యుద్ద సన్నివేశాలను చాలా వరకు ఫారిన్ లో షూట్ చేయాలనీ దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన గ్రాఫిక్ వర్క్స్, భారీ సెట్టింగులు, లవిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని తీర్చిదిద్దాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

వార్ సీన్స్ తీయడానికి అనువైన ఫారిన్ లోకేషన్స్ ని త్వరలో డిసైడ్ చేయనున్నారు. యోధుడు అనే తాత్కాలిక టైటిల్ తో రానున్న ఈ సినిమా గురించి ఉగాది సందర్భంగా ఈనెల 8న అమరావతిలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -