Friday, April 26, 2024
- Advertisement -

‘బాహుబలి -2’ లో బాలీవుడ్ భామ!

- Advertisement -

ఎప్పుడైతే ‘బాహుబలి’ చిత్రాన్ని కరుణ్ జోహార్ తీసుకున్నాడో అప్పుడు దాని సినేరియా మారిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి -2’ రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కొందరు బాలీవుడ్ స్టార్స్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ కలర్ మారుతుందనేది నిజం.

ఈ విషయం బాహుబలి నిర్మాతలు చర్చించి, ఈ సినిమాలో కీలకమైన పాత్రకు గానూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈమేరకు ఆమెతో చర్చలు సైతం జరిపినట్లు బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ పాత్ర తెరపై చాలా తక్కువ సేపు ఉంటుందని తెలుస్తోంది.

దాంతో దీపిక ఆలోచనలో పడిందని చెప్తున్నారు. కానీ కరుణ్ జోహార్ ఆమెను ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని, ఆమెకు ఆ మేరకు మంచి రెమ్యునేషన్ సైతం ఆఫర్ చేసారని తెలుస్తోంది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో చేయటం తనకు సంతోషమే కానీ మరీ అంత చిన్న పాత్రలో కనిపించటం వలన ఒరిగేదేమి ఉంటుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు.

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ‘బాహుబలి -2’ చిత్రాన్ని ప్రమోట్ చేసేటప్పుడు ఆమె బాగా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ ప్రేక్షకులు సైతం మరింతగా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -