Wednesday, May 22, 2024
- Advertisement -

తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -

వేసవివచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ కూడా పెరగనుంది. విద్యార్ధుల పరీక్షలు కూడా పూర్తి కావస్తూండడంతో తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రయాణమవుతున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న 50 రూపాయల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. ఈ నిర్ణయం ఈ నెల 15 నుంచి జూన్ 30 తేది వరకూ నిషేదించారు. అలాగే ప్రతి శుక్రవారం నాడు విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఆలయ ఈవో సాంబశివరావు ప్రకటంచారు.దీంతో పాటుప్రతి శుక్రవారం ఉదయం పూట వృద్ధులు, వికలాంగులకు కల్పించే దర్శనాన్నికూడా  రద్దు చేశారు.

ఈ ప్రత్యేక ఏర్పాట్ల వల్ల వేసవి కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగవని అధికారులు చెబుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లా వొంటి మామిడి రామాలయంలో స్వామి వారి కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -