- Advertisement -

దేవర..టీజర్ లోడింగ్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. నూతన సంవత్సరం కానుకగా దేవర టీజర్ రానుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్.

టీజ‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నామని సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేవర టీజ‌ర్ సూప‌ర్ గా వ‌చ్చింది. గూస్ బంప్స్ అంతే.. ఈ టీజర్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. అందరూ టైగ‌ర్‌ను అభినందించాల్సిందే అంటూ తారక్‌ పై ప్రశంసలు గుప్పించారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా ఈ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండ‌గా తారక్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -