Sunday, April 28, 2024
- Advertisement -

సలార్ యాక్షన్ ప్రొమో..

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా ఈ జోరు ఇలాగే కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరనుంది.

సలార్‌తో ప్రభాస్ హిట్ బాటపట్టగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మరింత జోష్ ఇచ్చేలా మాస్ యాక్షన్ ప్రొమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దేవుళ్ళు ఎలాగో రారు అన్నావుగా అందుకే ఇటు తిరిగి మొక్కుతున్న అంటూ రిలీజ్ చేసిన ప్రొమో అదుర్స్ అనిపించేలా ఉంది.

ఖాన్సార్ అరాచక సామ్రాజ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతుంటుంది. ప్రత్యేక రాజ్యాంగం తయారు చేసుకొని, రాజ్యానికి నాలుగు వైపుల బలమైన గోడలు నిర్మించి అక్కడి రాజు రాజమ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) సామ్రాజ్య పాలన చేస్తుంటాడు. తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని దొర‌గా చేయాలని అనుకుంటాడు. కానీ అంతలోనే అంతరుద్యం మొదలుకాగా వరద రాజమన్నార్ స్నేహితుడు ప్రభాస్ అండగా నిలుస్తాడు. ఇక ఫస్ట్ పార్ట్ మొత్తం వీరిద్దరి స్నేహం, తర్వాత వీరు శత్రువులుగా ఎలా మారారో చూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -