- Advertisement -

అనుప‌మ‌తో బ్రేక‌ప్.. ధ్రువ్ ఏమన్నారంటే!

- Advertisement -

నటుడు ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారంపై ఓపెన్‌గా మాట్లాడారు. నటి అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యల తర్వాత తనపై వస్తున్న వార్తల గురించి ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తన బ్రేకప్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం తనను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసిందని ధ్రువ్ చెప్పారు. అయితే తన కుటుంబం, అభిమానులు తనకు కొండంత ధైర్యం ఇచ్చారని తెలిపారు. వారి వల్లే తాను ఆ కష్టాల నుంచి బయటపడగలిగానని చెప్పారు. సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడే తన వ్యక్తిగత జీవితంపై అందరి దృష్టి ఉంటుందని తనకు తెలుసని అన్నారు. ఆ కష్ట సమయంలో తన తల్లి తనకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ వెన్నెంటుందని గుర్తుచేసుకున్నారు.

ఈ విమర్శలు తనను అస్సలు ప్రభావితం చేయలేవని చెప్పలేనని ధ్రువ్ అన్నారు. అయితే ఇలాంటి సమయాల్లో మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. మనమేమిటో, దేనికోసం నిలబడ్డామో స్పష్టత ఉండాలని తెలిపారు. మనకు నచ్చిన వారిని, మన ప్రాణంగా భావించే ప్రతి విషయాన్ని కాపాడుకోవాలని చెప్పారు. మన ప్రవర్తన నిజాయతీగా ఉన్నప్పుడు బయట జరిగే ఎలాంటి విమర్శలు కూడా మనల్ని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.

తాను సోషల్‌ మీడియాలో చాలా తక్కువ సమయం గడుపుతానని ధ్రువ్ తెలిపారు. తనకు వీడియోలు తీయడం, ఎడిటింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. వీడియోలను షూట్ చేసి మ్యూజిక్‌కి తగ్గట్టుగా కట్ చేస్తుంటానని తెలిపారు. అయితే ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయనని స్పష్టం చేశారు. కేవలం సినిమాలు విడుదలయ్యేటప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు. మిగిలిన సమయాల్లో పుస్తకాలు చదవడం, సంగీతం వినడంలోనే గడుపుతానని వివరించారు.

కొన్ని రోజుల క్రితం నటి అనుపమ పరమేశ్వరన్ ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు. తాను గతంలో రెండేళ్ల పాటు ఒకరితో రిలేషన్‌లో ఉన్నప్పుడు చాలా నరకం అనుభవించానని చెప్పారు. మానసిక వేధింపులతో పాటు శారీరకంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఆమె ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ, గతంలో వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆ వ్యక్తి ధ్రువ్ విక్రమ్ అని ప్రచారం జరిగింది. ‘బైసన్‌’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే రూమర్స్ వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -