- Advertisement -

ఉప్పల్ బాలు ఆరోపణలు.. నవదీప్ ఏమ‌న్నారంటే?

- Advertisement -

ప్రస్తుతం ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’ షో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న హీరో నవదీప్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు తాజాగా నవదీప్ తనను అవమానించాడని ఆరోపించాడు. తన చావుకు నవదీప్ కారణమంటూ వరుసపెట్టి వీడియోలు రిలీజ్ చేశాడు. దీంతో నెటిజన్లు అంతా బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్‌ను విమర్శించారు. ఎట్టకేలకు ఈ వివాదంపై నవదీప్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

షో గురించి నవదీప్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద రియాలిటీ షో అని చెప్పాడు. వంద మంది వేర్వేరు మనస్తత్వాలు ఉన్నవాళ్ళతో కలిసి బతికేటప్పుడు, వాళ్ళు అనే మాటలను ఎలా రిసీవ్ చేసుకోవాలి? కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అనేదే అసలైన పాయింట్ అని తెలిపాడు. ఆ విషయాలను టెస్ట్ చేయడానికే తమను జడ్జిలుగా పెట్టారని స్పష్టం చేశాడు.

షోలోకి వచ్చే కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? ఆ నెగెటివ్ కామెంట్స్‌పై వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చూసేందుకే తాము వాళ్ల సహనాన్ని పరీక్షిస్తామని నవదీప్ వివరించాడు. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలా ఉన్నా సరే, జడ్జిగా వెళ్లే ముందే తనకు ఆ రూల్స్ అన్నీ తెలుసని అన్నాడు. హర్టర్ సినిమాకు వచ్చి భయపెట్టొద్దు అంటే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, తట్టుకుని నిలబడాలనేదే ఈ షో మెయిన్ కాన్సెప్ట్ అని తేల్చిచెప్పాడు.

‘అగ్నిపరీక్ష’ అంటేనే కంటెస్టెంట్లను ట్రిగర్ చేయడం అని నవదీప్ ఓపెన్‌గా చెప్పాడు. తన లాంటి వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడినా సరే, అవన్నీ తట్టుకుని నిలబడే గట్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలని అన్నాడు. అలాంటి ఓపిక, శక్తి ఉంటేనే షోకి రావాలని, లేకపోతే రావడం వేస్ట్ అని సూచించాడు. ఈ షో నేపధ్యం పూర్తిగా దానికోసమే డిజైన్ చేశామని నవదీప్ చెప్పుకొచ్చాడు.

https://www.instagram.com/reel/DcJA1VQpETj/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -